సంజీవయ్య ఆశయ సాధనకు అందరూ పనిచేయాలి :- పిఠాపురం జనసేన నాయకులు సత్యప్రసాద్

    పిఠాపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గములో  దామోదరం సంజీవయ్య గారి శతజయంతి సందర్భంగా  జనసేన నాయకులు సత్యప్రసాద్    ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయనది చెరగని స్థానం. నీతి, నిజాయితీకి నిలువుటద్దం. పల్లె నుంచి ఢిల్లీకెదిగిన రాజకీయ మేధావి. ఎన్నో పదవులను అలంకరించడమే కాకుండా ఆ పదవులకు వన్నె తెచ్చిన మహా నాయకుడు దామోదరం సంజీవయ్య గారని అన్నారు. అలాగే ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. రిక్షాలో అసెంబ్లీకి వెళ్లిన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ మరియు తొలి దళిత ముఖ్యమంత్రి, ఆదర్శ నాయకుడు, నిరాడంబరుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఎనలేని ప్రజాసేవను గుర్తు చేసుకుంటూ.. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దామోదరం సంజీవయ్య గారి జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

See also  అనాధ పిల్లలకు 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :