
నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలం, సోమశిల గ్రామంలో కరెంట్ ఆఫీస్, శ్మశాన వాటిక దగ్గరలో చెత్త ఎక్కువ ఉంది. ఇక్కడ చెత్త ఎక్కువ ఉండడం వల్ల మురికి నీరు ఎక్కువగా ఉండిపోయి చెత్త మరింత దుర్వాసన వస్తోంది. దగ్గరలోనే ప్రజల నివాసం ఉండటం వల్ల ఆ చెత్త దుర్వాసనను భరించలేకున్నారు. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. చిన్న పిల్లలకు కూడా జ్వరాలు, వాంతులు వచ్చి అనారోగ్యపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ జనసైనికులు. పలుమార్లు అధికారులకు ఈ సమస్య గురించి విన్నవించినా ఫలితం లేదని అన్నారు. ప్రస్తుతం కరోనా విజృ0భిస్తున్న వేళ ఇలా ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. ఈ సమస్యను అధికారులు వీలయినంత త్వరగా పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తులో పోరాటం చేస్తామని హెచ్చరించారు. వెంటనే అధికారులు స్పందించాలని శుభ్రం చేయాలి సోమశిల యూత్ లక్ష్మి కుమార్ గౌడ్ మీడియా తో మాట్లాడారు .ఈ కార్యక్రమంలో లక్ష్మి కుమార్ గౌడ్ , చెందు ,మురళి ,కాశి రాజు , హరి తదితరులు పాల్గొన్నారు .








