విజయనగరం 44వ డివిజన్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు

విజయనగరం

            విజయనగరం ( జనస్వరం ) : నియోజకవర్గం స్థానిక అయ్యన్నపేట 44వ డివిజన్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ శిబిరానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ముఖ్య అతిధిగా విచ్చేసి.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఒక్క సీటు రాకపోయినా సరే నిత్యము రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాస్వామ్యంలో ఉండే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని తెలియజేశారు.. ఇదే విధంగా విజయనగరం నియోజకవర్గంలో డివిజన్ లో జనసేన పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన అయ్యన్నపేట గ్రామ జన సైనికులకు మరియు విజన్ హెల్త్ ఆర్గనైజేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయం హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండర్ రామకృష్ణ గారు, జనసేన పార్టీ జిల్లా నాయకులు లాలిశెట్టి రవితేజ, మాత గాయత్రి, లోకల్ బాయ్ ప్రసాద్, మండల ఇన్ఛార్జ్ చంద్ర నాయుడు, చక్రవర్తి, ఆయన పేట డివిజన్ నాయకులు పతివాడ చంద్రశేఖర్, ఆధార్ మురళి, స్వామి, ఆనంద్ కుమార్, కాళీ బాబు, కోట్ల సురేష్, శేఖర్, సన్యాసిరావు, గోవింద్, భాస్కర్ రావు, రమేష్, సత్యనారాయణ, రాము మరియు అయ్యన్న పేట డివిజన్ జనసైనికులు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని మెడికల్ క్యాంపు విజయవంతం చేయడం జరిగింది.

See also  గజపతినగరం నియోజకవర్గంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి