భోసి గ్రామంలో అంబేద్కర్ భవనం ఏర్పాటు చేయండి.

– స్థలం 40 సంవత్సరాల నుంచి దళిత ప్రజల అధీనంలో ఉంది.

భైంసా, మార్చి 03, జనస్వరం :  భోసి గ్రామంలో దళిత ప్రజలకు సుమారు 40 సంవత్సర లో అప్పుడున్న నిర్మల్ జిల్లా కలెక్టర్ సుబ్బారావ్ చేతులు మీదుగా 1.5 (ఒక ఎకరం ఐదు గుంటలు) భూమి కేటాయించారని స్థలంలో అంబేద్కర్ విగ్రహం తో పాటు అన్నబావు సాటే విగ్రహం దళిత ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు హరిజన పాఠశాల నిర్మించారాని అంటున్నారు కొన్ని రోజులు తర్వాత పాఠశాల భవనం కూల్చేశారాని ప్రస్తుతం అదే స్థలంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు.అన్ని కులాలు వారు ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు.అదే గ్రామానికి చెందిన కొందరు పాఠశాలకు సంబధించిన ప్రహరీ గోడ నిర్మాణం చేద్దామని పిల్లర్లు తవ్వుతుండగా మా స్థలం నుంచి తవ్వుతున్నారాని దళిత ప్రజలు ఆరోపిస్తే గ్రామ ప్రజలు పనులు ఆపేశారు,దళిత ప్రజలు అంబేద్కర్ భవనం కోసం పక్కన ఉన్న స్థలంలో నీలి పంచరింగ్ జెండాలు పెట్టీ కొన్ని నెలలు నుంచి పూజలు చేస్తుంటె అదే గ్రామానికి చెందిన కొందరు అక్కడ అంగన్వాడి పాఠశాల భవనం నిర్మాణం చేస్తామని చెప్పడంతో దళిత ప్రజలు కట్టనివ్వమని ఆ స్థలంలో అంబేద్కర్ భవనం ఏర్పాటు చేసి అంబేద్కర్ భవనంలో బుద్ధ మూర్తి పెట్టీ బుద్ధ వందనాలు చేసుకుంటామని దళిత ప్రజలు అనడంతో ఆ స్థలం మీకు ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయా లేకుంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని స్తానిక తహసీల్దార్ చెప్పడంతో అక్కడ నుంచి జెండాలు తీసేయాలని లేకుంటే కేసులు బుక్ చేస్తామని నోటీసులు ద్వారా తహసీల్దార్ చెప్పారు. ఏడు రోజుల లోపల జెండాలు తీసేయాలని అన్నారు 40 సంవత్సరాల నుంచి ఆ స్థలం దళిత ప్రజల అధీనంలో ఉందని అంబేద్కర్ భవనం ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని దళిత ప్రజలు అధికారులకు వేడుకుంటున్నారు.

See also  పవన్‌ కళ్యాణ్ పై వ్యాఖ్యలను నిరసిస్తూ శేరిలింగంపల్లి ఆందోళన కార్యక్రమం