టెక్కలిలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయండి : జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

టెక్కలిలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయండి : జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

              టెక్కలి పట్టణంలో గత రెండు సంవత్సరాలుగా ఆధార్ కేంద్రం లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కణితి కిరణ్ టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ గారిని కలసి వినతిపత్రాన్ని అందించారు. టెక్కలి ప్రజలు ఆధార్ కార్డుకి సంబందించిన ఏ పనికైనా సారవకోట, జలుమురు మండలాలకు వెళ్తున్నారు. మొన్నటి వరకు టెక్కలికి దగ్గరలో నౌపడా బ్యాంక్ లో ఆధార్ కేంద్రం ఉన్నపటికీ ఇప్పుడు కరోనా  నేపథ్యంలో అది కూడా మూసివేయడం వలన టెక్కలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కణితి సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై సబ్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి టెక్కలికి త్వరలో ఆధార్ కేంద్రం ఏ ర్పాటుకు కృషి చేస్తానని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొత్తూరు హరి, సాయి మహంతి, జగదీష్ పాల్గొన్నారు.

See also  విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు, వైద్యులకు, యాచకులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి