శృంగవరపుకోటలో బైక్ ర్యాలీతో జనసైనికుల ఉత్సాహం

శృంగవరపుకోట

            శృంగవరపుకోట ( జనస్వరం ) : పవన్ కల్యాణ్ గారి ఆశయ సాధన కోసం శృంగవరపుకోట నియోజకవర్గం వబ్బిన సత్యనారాయణ పెదిరెడ్ల రాజ శేఖర్ ఆధ్వర్యంలో యల్ కోట మండలంలోని గల గ్రామాలలోని విస్తృత ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరిచేవిధంగా 150 మంది జన సైనికులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎల్.కోటలో నిర్వహించే జనంలోకి జనసేన కార్యక్రమాన్ని జనసైనికులంతా విజయవంతం చేయడం జరిగింది. గత వారం వేపాడ మండలంలో నిర్వహించిన కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని జనసేన నాయకులు అన్నారు. ఆ మండల వ్యాప్తంగా పార్టీకి ఊపు వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని క్రియాశీలకం చేసి ఉత్సాహపరచడం జరిగిందన్నారు. ఈ  కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. 

See also  సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి