ప్రభుత్వ వైఖరి వల్లే ఇంజనీరింగ్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య : జనసేన నాయకులు రియాజ్ గారు

                చదువుల తల్లి తేజస్వినిది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్యే అని జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ రియాజ్ గారు అన్నారు. ఒంగోలు గొడుగు పాలెంలో గల మృతురాలు తేజస్విని కుటుంబాన్ని జనసేన బీజేపీ పార్టీ ప్రతినిధుల బృందం పరామర్శించింది. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృతురాలి కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవాలని షేక్ రియాజ్ గారు డిమాండ్ చేశారు. కిస్ కాలేజీ యాజమాన్యం ఇంతవరకు నోరు మెదప లేదు అన్నారు. జిల్లాకు చెందిన విద్యాశాఖ మంత్రి ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు విద్యార్థులను ఆదుకుంటామని చెప్పి చెప్పి చదువుల తల్లులను ఆత్మహత్య చేసుకున్నట్టు చేస్తుందని విమర్శించారు. జనసేన బీజేపీ పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్ రెడ్డి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తేజస్విని కుటుంబాన్ని పరామర్శించిన వారిలో బీజేపీ తరుపున మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఖలీఫా తుల భాష గారు తదితరులు పాల్గొన్నారు. 

See also  ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్పందించని ఎమ్మెల్యే, మేయర్లు, మునిసిపల్ కమిషనర్