
నీటి సమస్యను తీర్చాలని అధికారులను కోరుతున్న ఎచ్ఛర్ల జనసైనికులు
ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం కొత్త కుంకాం గ్రామపంచాయతీ నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానిక జనసేన ఎంపీటీసీ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ రావు తెలియచేశారు. ఈ సమస్యపై 24 గంటలు గడవకముందే జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు స్పందించి మీడియాను పిలిపించి స్థానిక మహిళలతో “నీటి పై పోరాటం” చేయడం జరిగింది. ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడానికి మా జనసేన పార్టీ తరఫున సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ గ్రామంలో మహిళలు నీటి కోసం పడుతున్నా నరకయాతన మీడియా ముఖంగా తెలియచేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి జనసేన నాయకులు ఆ గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. నీటి సమస్య తీరే అంత వరకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన ఎంపీటీసీ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాసరావు,రాంబాబు, విజయకృష్ణా, రాజు. జీ.సిగడాం మండల జడ్పిటిసి అభ్యర్థి భూపతి అర్జున్ రావు గారు, ఈ ఎచ్ఛర్ల మండలం జడ్పిటిసి అభ్యర్థి తమ్మినేని శ్రీనివాస్.రణస్థలం మండలం నాయకులు చిరంజీవి , అంజి బాబు, రెడ్డి భాస్కర్ ,రామారావు ,కృష్ణ. మధు బాబు, సంతోష్ స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.








