జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి జనసైనికులతో చర్చించిన ఎచ్ఛర్ల నాయకురాలు శ్రీ కాంతి శ్రీ గారు

జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి జనసైనికులతో చర్చించిన ఎచ్ఛర్ల నాయకురాలు శ్రీ కాంతి శ్రీ గారు

                    ఎచ్చెర్ల మండలం. తోటపాలెం పంచాయతీ కల్కినగర్ లో శ్రీమతి శ్రీ క్రాంతి శ్రీ గారు,  Dr విశ్వక్సేన్ గారు జనసేన పార్టీని గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఏవిధంగా ముందుకు సాగాలో జనసేనా సిద్ధాంతాలును ప్రజలుకు పూర్తిగా తీసుకెళ్లాలని వివిధ అంశాలపై సమావేశం పెట్టి చర్చించడం జరిగింది. క్రాంతి శ్రీ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 650  ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు సలహా సూచనలు తెలియజేసారు, అలాగే పవన్ కళ్యాణ్ వారోత్సవాల్లో పాల్గొని, ఘనంగా జన్మదిన సేవా కార్యక్రమాలు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే ఈ కార్యక్రమంలో శివ, రాం ప్రసాద్, జయప్రకాష్ రాజశేఖర్, నూకరాజు, లక్ష్మీ నాయుడు, దుర్గారావు మరియు  ssr పురం ,చిన్నరావు పల్లి, బలిజిపేట, చిలకాపాలెం, రణస్థలం గ్రామాల జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. 

See also  వైసీపీ పార్టీకి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది, "సత్యమేవ జయతే" దీక్షలో వాసగిరి మణికంఠ