జగన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి

జగన్ రెడ్డి

        ఒంగోలు ( జనస్వరం ) : ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 55వ రోజు ఒంగోలులోని 28వ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ గారి ఆధ్వర్యంలో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా వివిధ వర్గాల ప్రజలు జనసేన నాయకులతో మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి అని, గద్దినెక్కిన నాటి నుండి అభివృద్ధి లేకుండా పోయిందని, ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడారాలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ రాజకీయాలు మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో లేదని, ఆయనకున్న శ్రద్ధ ఒక్కటే కులాల మధ్య చిచ్చు పెట్టి తన పబ్బం కడుపుకోవటమే, అలాంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి అండగా నిలుస్తామని మా మద్దతు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, మరియు జనసేన నాయకులు చెన్ను నరేష్, పఠాన్ కాలేషా, యాదల సుధీర్, రాము తీగల, సాయి కృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు

See also  సీఎం జగన్ బటన్ ని రిపేర్ చేయాలి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి