
భీమడోలు, మార్చి 30 (జనస్వరం) : భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలోని మావులేటి మధుసూధనరాజు ఫౌండేషన్ (మధు ఫౌండేషన్) ఆధ్వర్యంలో సోమవారం రామాలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరం నుంచి ఫౌండేషన్ సేవలు ప్రారంభించామని, 2004 నుంచి చలివేంద్రం ద్వారా ఉచిత మంచినీటిని ప్రజలకు అందిస్తున్నట్లు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వెంకటరాజు తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









