ఇండియన్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో డాక్టర్ జేవీఎస్ భాస్కర్‌కు ‘ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు.

*ఇండియన్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో డా. జేవీఎస్ భాస్కర్‌కు ‘ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు*

హైదరాబాద్.జూన్ 24( జనస్వరం)

విద్యా రంగం, యువత సాధికారత, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న ఇన్‌స్పైర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీఈఓ డా. జేవీఎస్ భాస్కర్ కు హైదరాబాద్‌లో నిర్వహించిన 33వ ఇండియన్ ఎడ్యుకేషన్ సమ్మిట్ (IES) లో ప్రతిష్టాత్మక ‘ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు’ ప్రదానం చేశారు.విద్యా రంగంలో విశిష్ట నాయకత్వం ప్రదర్శిస్తూ, యువత అభివృద్ధి మరియు సమాజ పురోగతికి కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి ఈ అవార్డును అందజేస్తారు.ఈ సందర్భంగా డా. జేవీఎస్ భాస్కర్ మాట్లాడుతూ, విద్య ద్వారా యువతను శక్తివంతం చేసి, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇన్‌స్పైర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువత సాధికారత, వ్యక్తిత్వ వికాసం, విద్యా ప్రోత్సాహం మరియు సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.డాక్టర్ భాస్కర్ సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయడం ఆనందంగా ఉందని సమ్మిట్ నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా విద్యాభివృద్ధి, యువత సంక్షేమం మరియు సమాజ సేవ కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని డా. భాస్కర్ అన్నారు.

ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, సామాజిక సేవకులు, విద్యాసంస్థల ప్రతినిధులు డా. జేవీఎస్ భాస్కర్‌ను అభినందించారు.
“విద్యతో యువతను శక్తివంతం చేయడం,సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడం నా జీవిత లక్ష్యం” అని డాక్టర్ జేవీఎస్ భాస్కర్ పేర్కొన్నారు.

See also  కల్వకుర్తి వద్ద బీసీ బంద్‌కు మద్దతు – 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యం