డా. చంటి ముదిరాజ్‌కు ప్రతిష్ఠాత్మక సేవారత్న అవార్డు

   హైదరాబాద్, నవంబర్ 5, (జనస్వరం): తెలంగాణకు గౌరవం తెచ్చేలా హైదరాబాద్‌కు చెందిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డా. చంటి ముదిరాజ్ “సేవారత్న అవార్డు – 2025” అందుకున్నారు. ఢిల్లీ నుండి ప్రదానం చేసిన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆయన సామాజిక సేవా రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా లభించింది. ప్రజా హక్కుల సాధనలో నిరంతర పోరాటం, సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు ఈ అవార్డు అందజేశారు. సమాజానికి సేవా స్పూర్తితో మార్గదర్శకుడిగా నిలిచినందుకు ఆయనను వివిధ సంఘాలు, సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు అభినందించారు. డా. చంటి ముదిరాజ్ సేవారత్న అవార్డు అందుకోవడం యావత్ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఫ్యామిలికి ఆనందాన్నిచ్చిందని సభ్యులు తెలిపారు.

See also  రూరల్ మండల ప్రజల కోసం ప్రజాదర్బార్ కార్యక్రమం : ఎమ్మెల్యే పరిటాల సునీత