
ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – వెండి విగ్రహానికి నివాళులర్పించిన శ్రీకాంత్ చెన్నుపాటి మరియు ముత్యాల బాబు.
విజయవాడ,ఏప్రిల్ 14 ( జనస్వరం)
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంస్థ జాతీయ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు శ్రీకాంత్ చెన్నుపాటి మరియు జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల బాబు వెండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.జాతీయ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు శ్రీకాంత్ చెన్నుపాటి మాట్లాడుతూ
అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని, దేశంలోని అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రతి పౌరుడు సమాన హక్కులను అనుభవిస్తున్నారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల బాబు మాట్లాడుతూ బాబాసాహెబ్ చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. విద్య, సంఘటితం, పోరాటం అనే సూత్రాలను పాటిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని” ఆకాంక్షించారు.








