నేషనల్ హైవే స్కెచ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా డా. మైఫోర్స్ మహేష్

       మదనపల్లి ( జనస్వరం ) : నేషనల్ హైవే స్కెచ్ తో ఇబ్బందులు పడుతున్న అమ్మ చెరువు మిట్ట ప్రజలు, సమస్యల పరిష్కారం కోసం హైవే అధికారులతో చర్చించిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ మైఫోర్స్ మహేష్. త్వరతగతిన సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నేషనల్ హైవే అధికారులు. నేడు మదనపల్లి నియోజకవర్గంలోని అమ్మ చెరువు మిట్ట నందు హైవే పనుల వల్ల అక్కడ ఉన్న గృహాల కంటే సుమారు 10-15 అడుగులు లోతున ఆ హైవే ఏర్పాటు కోసం పనులు జరుగుతున్న తరుణంలో స్థానిక ప్రజల అభ్యంతరం మేరకు స్థలానికి వెళ్లి గృహాల కంటే 15-20 అడుగుల లోతులో రోడ్డు వేయడం వల్ల ఆ సుమారు 5-6 వీధులకి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఎటువంటి నిత్యవసరకు సంబంధించిన నీళ్లు ట్యాంకర్లు గాని వివిధ వాళ్లు రాకపోకలు గాని చాలా ఇబ్బందులు పడతారు. కావున అధికారులు అర్థం చేసుకుని ఆ రోడ్డు హైట్ ని పెంచడం లేదా స్థానిక ప్రజల సౌకర్యార్థం సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడం చేయాలని లేని పక్షంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని అధికారులకి తెలియజేశారు. స్థానిక ప్రజలతో మరియు అధికారులతో మాట్లాడి నేషనల్ హైవే రోడ్డుని హైట్ పెంచడమా లేదా సర్వీస్ రోడ్డు కేటాయించడం ఏదో ఒకటి చేస్తామని అధికారులు ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి, వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. 

See also  జనసేనానిని కించపరిచేలా ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగించాలని జనసేనాయకుల డిమాండ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి