నిరుద్యోగుల గోడు వినిపించదా : జనసేన నాయకులు భరత్

జనసేన

         నెల్లూరు ( జనస్వరం ) : యువత చదువుకుని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా తిరుగుతున్నారని జిల్లా నాయకులు భరత్  అన్నారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకి సబ్సిడీ లోన్ లు, పారిశ్రామిక వేత్తల కింద లోన్ లు, ప్రోత్సాహకాలు సరిగా ఇవ్వడం లేదని అందువల్ల యువత విదేశాలకు వలస పోతున్నారని ధ్వజమెత్తారు.  MBA చదివిన వారు కూడా టీ కొట్టులు, పండ్ల దుకాణాలు పెట్టుకుని గిట్టుబాటు కాక అప్పులు పాలు అవుతున్నారన్నారు. ఈ దయనీయ పరిస్థితిని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత ఈ ప్రభుత్వాలు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేశాయని అన్నారు. నిరుద్యోగులని ఓటు బ్యాంక్ గా నే చూస్తున్నారు తప్ప వారి సమస్యలకు పరిష్కారం చూపడం లేదన్నారు. జనసేనపార్టీకి అవకాశం అందిస్తే  నిరుద్యోగులకు వ్యాపారవకాశాలని కల్పిస్తామని  అన్నారు. 

See also  చిన్నారులకు విద్యను దూరం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం : మత్స పుండరీకం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి