
శ్రీకాకుళం జనసేన BSU విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పరికరాలు పంపిణీ
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వీరఘట్టం మండలం తెట్టంగి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం క్రీడా పరికరాలను పాలకొండ నియోజకర్గ జనసేన నాయుకుడు శ్రీ గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో విద్యార్ధులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం జనసేన పార్టీ నుండి గతంలో పాఠశాలకు చేసిన సేవలకు గాను శ్రీ గర్భాన సత్తిబాబు గారి కి దుశ్శాలువాతో చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు గర్భపు నరేంద్ర BSU జిల్లా నాయకులు మరియు పాలకొండ పట్టణం జనసేన నాయకులు గొర్లె మన్మధరావు, కిషోర్, శ్యామ్, యోగి, ప్రశాంత్, వీరఘట్టం జనసేన పార్టీ నాయకులు రవికుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.









