కాకినాడలో జనసేనాని జన్మదిన సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ

కాకినాడ

         కాకినాడ ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 43 వ వార్డు ఉపాధ్యక్షులు చిట్టూరి మౌనిక్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత జన్మదిన వేడుకల్లో భాగంగా భారీ బైక్ ర్యాలీ, భారీ కేక్ కటింగ్ జరిపారు. PAC మెంబెర్  ముత్తా శశిధర్ ముఖ్య అతిధిగా విచ్చేసి అధినేత చేసిన సేవాగుణం గురించి ప్రజలకు వివరిస్తూ, పార్టీ నియమాలను పాటిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని నగర అధ్యక్షులు  సంగిశెట్టి అశోక్ గారితో పాటు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి శివ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు తలాటం సత్య  మొదలగు వారితో కార్యక్రమాన్ని ప్రారంభించి 200 మంది మహిళలకు చీరల పంపిణీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసైనికులకు మరియు వీరమహిళలకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

See also  మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు