విజయవాడ 47వ డివిజన్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ 

     విజయవాడ, (జనస్వరం) : స్థానిక జనసేన పార్టీ 47 డివిజన్ కార్యాలయంలో ఆదివారం 2000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాత చింతలపూడి సత్యనారాయణ వాళ్ళ అమ్మ చింతలపూడి కనకదుర్గ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు గౌరీ శంకర్ మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం ఉంటే బయటకు రావాలని, అది కూడా గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ గుండు జితేంద్ర, సభ్యులు పొట్నూరి శంకర్, కరణం దివాకర్, మలపరెడ్డి, అప్పారావు, బసవ రాజేష్, జిల్లెల్ల అనిల్, జి అరవింద్ పాల్గొన్నారు.

See also  టిడ్కో గృహాల నిర్మాణాల అవతవకలపై అధికారులకు వినతిపత్రం అందించిన వినుతాకోట

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి