
విశాఖపట్నం నరవ గ్రామం గ్రామానికి రహదారిని వేయాలని జనసైనికుల ఆధ్వర్యంలో ధర్నా
విశాఖపట్నం నరవ గ్రామం నుండి షీలానగర్ వెళ్లే రహదారి వీధి రహదారి నిమిత్తం గతంలో రూ.2 కోట్లు మంజూరైన ఇప్పటికీ రోడ్డు విస్తరణ చేయడం మర్చిపోయారు అని మరొకసారి GVMC అధికారులకి గుర్తు చేయడంతోపాటు వెంటనే రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టమని జనసేన పార్టీ తరఫున స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం 2018 వ సంవత్సరంలో సుమారు రూ. 2 కోట్లు నిధులు మంజూరు చేయడం తో పాటు పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రస్తుత మంత్రి వర్యులు అవంతి శ్రీనివాసరావు గారు, అప్పటి GVMC కమిషనర్ గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత పెందుర్తి MLA అదీప్రాజు గారు కూడా రోడ్ కావాలని ధర్నా చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు ను మొదలు పెట్టడం మర్చిపోవడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా రోడ్డు పనులు మొదలు పెట్టమని జనసేన పార్టీ తరపున MLA గారిని కోరుచున్నాము అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









