జనసేన సంస్థాగత నిర్మాణానికి దరఖాస్తు సమర్పించిన దేవన సంతోష్ కుమార్

 అనంతపురం, జూలై 5 (జనస్వరం): అనంతపురం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “నిర్మాణ సారథుల సమాచార సేకరణ” కార్యక్రమంలో భాగంగా దేవన సంతోష్ కుమార్ పార్టీ పదవి బాధ్యతల కోసం తన దరఖాస్తును పరిశీలకులు, టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్‌కు సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జనసైనికులు, పార్టీ నాయకులు విశేష స్పందన వ్యక్తం చేస్తుండగా, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పారదర్శకంగా బలోపేతం చేసే దిశగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా దేవన సంతోష్ కుమార్ మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పార్టీ బలోపేతానికి అంకితభావంతో సేవలందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ ఆశయాల సాధన కోసం నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు.

See also  క్రీడలతో యువతలో నాయకత్వం క్రమశిక్షణ పెంపొందించాలి : ఎమ్మెల్యే లోకం మాధవి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి