దళిత భూములు అక్రమంగా కబ్జా చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు : వేగుళ్ళ లీలాకృష్ణ

         తూర్పుగోదావరి ( జనస్వరం ) : కాజులూరు మండలం, పల్లెపాలెం గ్రామంలో వెంకట సుబ్బారెడ్డి గారి 35.94 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమిని గవర్నమెంట్ కు డిక్లర్ చేయడం జరిగింది. దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే సమయంలో ప్రస్తుత వైస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తన అధికార మదంతో ప్రభుత్వానికి చెందవలసిన దళితుల భూములను మరియు భూమి యజమానులను బెదిరించి, అక్రమంగా తన భార్య మరియు బంధువులు పేర తప్పుడు కాగితాలు సృష్టించి భూముని దర్జాగా కబ్జా చేశారు. దీనిపై కాకినాడ కలెక్టర్ కు పిర్యాదు చేసిన మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ మరియు జనసేన ఇంఛార్జిలు, నాయకులు. తక్షణమే వీటిపై చర్య చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

See also  వైకాపా ప్రభుత్వం హయాంలో ఉత్సవ విగ్రహాలుగా సర్పంచులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి