రైతులకు పంట నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి : ఆళ్ళగడ్డ జనసేన పార్టీ డిమాండ్

రైతులకు పంట నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి : ఆళ్ళగడ్డ జనసేన పార్టీ డిమాండ్

                  కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో ముత్తలూరు నరసాపురం, ఆలమూరు, తిప్పారెడ్డిపల్లె గ్రామాల్లో నివర్ తుఫాన్ కారణంగా వరి, అరటి, మొక్కజొన్న, మినుము, పత్తి పంటలు నష్టపోయిన రైతులను కలుస్తూ పంట నష్టాన్ని పరిశీలించిన ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య. అయన మాట్లాడుతూ నష్టపోయిన రైతుకు ఒక ఎకరాకు 20 వేల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే చెలించాలని, అలాగే రైతుల ఎకరం పొలంకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆంజనేయులు, పసుల నరేంద్రయాదవ్, రాజారామ్ రమేష్, చంద్ర, కర్ణ, శివ, నరసింహ, నందు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. 

See also  ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు డిమాండ్