కార్యకర్తలకు కొండంత ధైర్యం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

       నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 269వ రోజున 54వ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో జరగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10 నుండి 28 వరకు జరగనున్న జనసేన పార్టీ మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యకర్తలందరికీ ఒక వరం లాంటిదని అన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల సాయం, గాయపడిన వారికి 50 వేల రూపాయల సాయం ఈ సభ్యత్వం ద్వారా అందుతుందని అన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదం సంభవించినప్పుడు పార్టీ అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం పాటు పడేవారని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  యువశక్తిని రాజకీయశక్తిగా మార్చడమే జనసేన పార్టీ లక్ష్యం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :