
అనంతపురం, నవంబర్ 7, జనస్వరం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ అనంతనగరంలో ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నగరంలోని శ్రీ అనంత వెంకటరెడ్డి ఫ్లై ఓవర్ అండర్ పాస్ మొదలుకొని కోర్ట్ రోడ్ ఇరువైపులా కోర్ట్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానీషా, జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు, వై సి పి నాయకులు యన్. దాసిరెడ్డి,వై.సూర్య నారాయణ రెడ్డి, రాధాకృష్ణ గౌడ్ తదితరులు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రైవేటు పరం చేస్తున్న వైద్య కళాశాలలను నిరసనగా ప్రజలకు దాని ప్రాధాన్యతను వారు క్షుణ్ణంగా వివరించారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ ఆపాలని ప్రతి పౌరుడు ఎందుకు మద్దతు ఇవ్వాలని, భవిష్యత్తు తరాలైన మన పిల్లలకు పేదలకు వైద్యం అందించాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైద్య సకళాశాల కాపాడుకొని ఆ విద్యను కూడా పేదలకు అందేలా చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం వారు తోపుడు బండ్లు, దుకాణ సముదాయాలు, ప్రజలు గుంపులుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో తిరిగి ఈ అంశాలను ప్రజలకు వివరిస్తూ తమకు మద్దతునివ్వాలని కార్యక్రమాన్ని ముందుకు సాగించారు.









