విజయనగరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

విజయనగరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

               క్రిస్మస్ వేడుకల్ని విజయనగరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ జనసేన నాయకులు ఆదాడ మోహనరావు మరియు త్యాడ రామకృష్ణారావు(బాలు) స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న యునైటెడ్ చర్చ్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా చర్చ్ దైవ ప్రబందుకులు సునీల్ పాస్టర్ కేక్ ను కట్ చేసి వేడుకల్ని ప్రారంభించారు. అనంతరం ప్రబందుకులు సునీల్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జనసైనుకులు మరియు ప్రజలందరూ ఆయురారోగ్యాలతోను, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన చేశారు. అనంతరం జనసేన నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ ఈ క్రిస్మస్ తో  ప్రజలందరూ కరోనా బారినుంచి రక్షింపబడి ప్రపంచమంతా ఎప్పటిలాగే సంతోషంగా ఉండాలని, క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ ప్రేమను, శాంతిని, సహాయాన్ని పంచిపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు లోపింటి కళ్యాణ్, దాసరి యోగేష్, దంతులూరి రమేష్ రాజు, గణేష్, పాల్గొన్నారు.

See also  పుట్టపర్తి నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :