చిత్తూరు జిల్లా : పెరిగిన విద్యుత్ చార్జీలపై జనసేన పోరాటం

విద్యుత్

           చిత్తూరు ( జనస్వరం ) : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం మరియు వివిధ నియోజకవర్గాల ఇంచార్జులుతో కలసి చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసనా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించే వరకు జనసేన ఉద్యమం తగ్గేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చేతితో సహాయం చేసి, ఇంకో చేత్తో ప్రజల నుంచి పన్నుల రూపంలో దోచుకునే ముఖ్యమంత్రి గద్దె దిగడం ఖాయమని, ప్రజలే ఓడించే రోజులు దగ్గరలో ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఈ రాష్ట్రం రావణకాష్టం అయిందని, భారంతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు సుఖంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాలు అయినా సరే అభివృద్ధిలో మాత్రం శూన్యమని, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే గడియలు ఆసన్నమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

See also  జనసేనపార్టీ హఫీజ్ పేట్ డివిజన్-109 అధ్యక్షురాలిగా మద్దూరి నాగలక్ష్మి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి