అనంతపురంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు, బైక్ ర్యాలీ

అనంతపురం, ఫిబ్రవరి 20, (జనస్వరం) : అనంతపురం నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 399వ జయంతి సందర్భంగా హిందూ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. వేదిక నాయకులు కేశవరెడ్డి, సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వర్ రెడ్డి, హరిహర దేవస్థానం అధ్యక్షుడు రవి, జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అశోక్ నగర్‌లోని హరిహర దేవస్థానంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ర్యాలీ ప్రారంభమైంది. అనంతరం సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, కోర్ట్ రోడ్ మార్గంగా హౌసింగ్ బోర్డ్‌లోని అభయాంజనేయ దేవస్థానానికి చేరుకుని అక్కడ ఉన్న విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ హిందూ సమాజ చైతన్యానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. సురేష్ మాట్లాడుతూ యువత సంప్రదాయాల పరిరక్షణలో ముందుండాలని, సామాజిక మాధ్యమాల ద్వారా ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. నాగేంద్ర యాదవ్ దేశ అభివృద్ధికి సమాజ ఐక్యత అవసరమని పిలుపునిచ్చారు. కేశవరెడ్డి భారీగా పాల్గొన్న యువతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు మరియు వందలాది మంది యువత పాల్గొని ర్యాలీ విజయవంతం చేశారు.

See also  చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం