క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం జిల్లా జనసేన నాయకులతో చర్చించిన చెన్నేకొత్తపల్లి పార్టీ సభ్యులు

చెన్నేకొత్తపల్లి

      చెన్నేకొత్తపల్లి (జనస్వరం) :  రాప్తాడు నియోజకవర్గం బసంపల్లి గ్రామ జనసేన పార్టీ సభ్యులు, జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారిని మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీటి.సి. వరుణ్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే క్షేత్ర స్టాయిలో ఉన్న సమస్యల గురించి వివరించారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్‌కళ్యాణ్‌ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లెలా ప్రణాళికలు రూపొందించేలా చర్చించారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బసంపల్లి జనసేన సర్పంచ్‌ అభ్యర్థి గిరక శివయ్య, నారాయణస్వామి, గోపి, హరి, నాగేంద్ర, ప్రవీణ్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

See also  అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు