భారత ఐకానిక్ అవార్డ్ 2026 కి ప్రత్యేక అతిథిగా CEO డాక్టర్ జె వి ఎస్ భాస్కర్

భారత్ ఐకానిక్ అవార్డ్స్ 2026కు ప్రత్యేక అతిథిగా CEO డాక్టర్ జేవీఎస్ భాస్కర్ ఆహ్వానం

కాకినాడ,ఏప్రిల్ 24( జనస్వరం )

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న భారత్ ఐకానిక్ అవార్డ్స్ 2026 కార్యక్రమానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరియు ఇన్‌స్పైర్ – రే ఆఫ్ లైఫ్ సంస్థ స్థాపకుడు & సీఈఓ డాక్టర్ జేవీఎస్ భాస్కర్ ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు.యువతకు మార్గదర్శకుడిగా, అంతర్జాతీయ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా గుర్తింపు పొందిన డాక్టర్ భాస్కర్,నెల్సన్ మండేలా అవార్డు మరియు భారత్ ఐకానిక్ అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. సమాజంలో యువత శక్తివంతం కావడానికి ఆయన చేస్తున్న కృషి విశేషంగా ప్రశంసలు అందుకుంటోంది.ఈ కార్యక్రమం ఏప్రిల్ 26, 2026 ఆదివారం హైదరాబాద్‌లోని ఆదిత్య పార్క్ సరోవర్ పోర్టికో హోటల్‌లో మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమవుతుంది.దేశం లోని ప్రముఖ వ్యక్తులు, వ్యాపార సంస్థలు, మరియు వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరచినవారిని ఈ వేడుకలో సత్కరించనున్నారు.
డాక్టర్ జేవీఎస్ భాస్కర్ పాల్గొనడం ఈ కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తీసుకువస్తుందని నిర్వాహకులు తెలిపారు. యువతలో స్పూర్తి నింపే ఆయన సందేశం ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ పింక్ ఆర్మీ మరియు ట్వెల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

See also  గొల్లప్రోలులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి