గుండాలపేట గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

గుండాలపేట, నవంబర్ 13, (జనస్వరం) : గుండాలపేట గ్రామాభివృద్ధి దిశగా కీలకమైన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగమాధవి గ్రామంలో సిమెంట్ కాంక్రీట్ రోడ్డును లాంఛనంగా ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రూ.8.20 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం గ్రామ ప్రజల రాకపోకలను మరింత సులభతరం చేయనుందని అధికారులు తెలిపారు. పల్లెల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధిచెందేలా అవసరమైన పనులను వేగంగా పూర్తి చేస్తామని ఆమె అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వాసుదేవరావు, పాలు శ్రీను, పైల శంకర్, తొత్తడి ప్రకాష్, స్వామి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అభివృద్ధి పనులకు స్వాగతం పలికారు.

See also  కొండపల్లి స్కూల్ లో MHPS ఆధ్వర్యంలో 69వ అంబేద్కర్ వర్ధంతి నివాళులు