
శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా విస్తృత కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహిస్తున్న పల్నాడు జిల్లా పోలీసులు.
బెల్లంకొండ,జనవరి23.(జనస్వరం)
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి సబ్ డివిజన్ బెల్లంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నే సుల్తాన్ పాలెం నందు సత్తెనపల్లి డి ఎస్పీ M.హనుమంతరావు ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్, పాత కేసులలోని నిందితుల పై ప్రత్యేక నిఘా. ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీలలో మన్నే సుల్తాన్ పాలెం గ్రామం నందు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు – 28,పలుగులు – 07,గొడ్డళ్లు – 04,కత్తులు – 08,బరిసెలు – 02, సర్వీస్ వైర్లు – 02,వైరు చుట్టలు – 12స్వాధీనం చేసుకున్నారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. హెల్మెట్ వాడకం గురించి సత్తెనపల్లి డిఎస్పీ హనుమంతరావు అవగాహన కల్పిస్తూ గ్రామంలోని ప్రజలచే తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాకుండా రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసులలోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పాత కేసుల నిందితులతో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని, గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని,గొడవలు సృష్టించే వారి మీద జిల్లా ఎస్పీ ఆదేశానుసారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మన్నే సుల్తాన్ పాలెం నందు జరిగిన కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో సత్తెనపల్లి సబ్ డివిజన్ డి ఎస్పీ M. హనుమంతరావు తో పాటు పెదకూరపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ P.సురేష్,అచ్చంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ P. శ్రీనివాస రావు, బెల్లంకొండ ఎస్ ఐ P. గోపి,9 మంది ఎస్ ఐ లు మరియు 53 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








