బీఎస్పీ నాయకురాలు నూజీవీడు జనసేన పార్టీలోకి చేరిక

జనసేన

       నూజీవీడు ( జనస్వరం ) : అగిరిపల్లి మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన బి‌ఎస్‌పి నియోజకవర్గ మాజీ వైస్ ప్రెసిడెంట్ ధనలక్ష్మి నూజివీడు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, ముమ్మలనేని సునీల్ కుమార్, బండారు రాజు, వీర మహిళ నాయకురాలు జక్కుల. లక్ష్మి సమక్షంలో నూజివీడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ లోకి వారిని కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలకడం జరిగింది. నూజివీడులో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా అని, పవన్ కళ్యాణ్ గారినీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా, మహిళల సమస్యల మీద పని చేస్తానని ధనలక్ష్మి ఈ సంధర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అగిరిపల్లి మండల కార్యదర్శి కోండిశెట్టి శీను, విజయ్, నూజివీడు మండల కార్యదర్శి sk నాగూర్, టౌన్ మైనారిటీ నాయకులు ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.

See also  నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులు బ్రతికేది ఎలా ? 

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి