బోయ వాల్మీకి ఇతర కులాలను ST జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్న అరకు గిరిజన జనసేన నాయకులు

బోయ వాల్మీకి

            అరకు ( జనస్వరం ) : నేడు జరిగిన మన్యం బంద్ లో జనసేన నాయకుడు (మాజీ ఎంపీటీసీ) దురియ సాయిబాబా అరకు నియోజక వర్గం అనంతగిరి మండలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం గిరిజ నేతరులైన (బోయ వాల్మీకి. బెంతు, ఒరియా తెగలను ఎస్టీ జాబితాలో చేర్పించాలని మార్చి 24 తేదీన అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తక్షణం మే ప్రభుత్వం తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో జనసేన నాయకులు, ఇతర సంస్థల నాయకులు పాల్గొన్నారు. 

See also  అనాధ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటిన గుడివాడ జనసైనికులు