హైదరాబాదులో నర్సాపురం నియోజకవర్గ జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బొమ్మిడి నాయకర్

హైదరాబాదు

           హైదరాబాదు ( జనస్వరం ) : హైదరాబాద్ లో నివసిస్తున్న నరసాపురం నియోజకవర్గ జనసేన కుటుంబ సభ్యుల కోసం ప్రగతీ నగర్ శ్రీ కృష్ణ గార్డెన్స్ హైదరాబాద్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నరసాపురం నియోజకవర్గ జనఈ కార్యక్రమానికి నర్సాపురం జనసేన పార్టీ ఇంచార్జి, PAC సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మైన్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నర్సాపురం నియోజకవర్గంలో జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత జనసేనపార్టీ సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా కార్యక్రమాలు చేశామన్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు స్థానిక సమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కార  ధ్యేయంగా పోరాడుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యధిక మెజీరిటీ వచ్చేలా ప్రణాళికలు రూపొందించి ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. మీరు హైదరాబాదులో ఉంటూ పార్టీ కోసం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగమవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  యలమవారిదిన్నెలో కోలాహలంగా ప్రారంభమైన పవనన్న ప్రజాబాట

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి