జనసైనికుడు కుటుంబాన్ని ఆదుకున్న జనసేన నాయకులు బోడపాటి శివదత్

    రాయవరం, (జనస్వరం) : ఎస్ రాయవరం మండలం గుర్రాజు పేట పంచాయతీలో ఉన్న జనసైనికుడు అండిబోయిన నూకరాజు ఈ మధ్య ప్రమాదానికి గురివడం జరిగింది. సుమారు సంవత్సరం పాటు పూర్తిగా మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న దొండవాక నాయకులు పిక్కి గోవిందు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలియపరచిన వెంటనే శివదత్ స్పందించి నక్కపల్లి, ఏస్ రాయవరం మండలాల జనసేన కార్యకర్తలు, గుర్రాజు పేట జనసైనికుల సమక్షంలో ఆ కుటుంబానికి 25 కేజీల బియ్యం, నూనె, పప్పులు, పంచదార, పలు నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదు సహాయాన్ని కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కురందాసు అప్పలరాజు, పిక్కి స్వామి, కోదండరాం, పప్పల శివ, గణేష్, జ్యోతి కుమార్, వరహాల బాబు, అల్లాడ రమణ, రాజు, తోట అప్పారావు, నాగేశ్వరరావు, శివాజి, జగదీష్, రాజు సూర్య తదితరులు పాల్గొన్నారు.

See also  గజపతినగరంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి