ఘనంగా ఎంఏఎం కళాశాలలో రక్తదాన శిబిరం – చైర్మన్ మేదరమెట్ల శేషగిరిరావు

ఎంఏఎం కళాశాలల్లో ఘనంగా రక్తదాన శిబిరం – చైర్మన్ మేదరమెట్ల శేషగిరిరావు

నరసరావుపేట,మార్చి 24( జనస్వరం)

ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎంఏఎం (MAM) విద్యాసంస్థల చైర్మన్ ఎం.ఆర్. శేషగిరిరావు మార్గదర్శకత్వంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ మరియు కళాశాల NSS విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ శేషగిరిరావు మాట్లాడుతూ కేవలం చదువు మాత్రమే కాదు, సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.రక్తదానం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదని, అది ప్రాణదాతగా నిలుస్తుందని విద్యార్థుల్లో అవగాహన కల్పించారు.రక్తదానం చేసిన విద్యార్థులకు చైర్మన్ స్వయంగా ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డా. ప్రసాద్, డా. సాదినేని రామారావు, డా. శివశంకర్, వైస్ ప్రిన్సిపాల్ డా. బండ్ల రవితేజ, NSS ఆఫీసర్ శాలెం రాజు మరియు రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

See also  ఉద్యమాల స్ఫూర్తి ప్రదాత అమృతరావు