
అనంతపురం ( జనస్వరం) : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి గారిపై నిన్న హైదరాబాద్‌లో ఎబిఎన్ ఛానల్ నందు వెంకటకృష్ణ గారు యాంకర్‌గా జరుపుతున్న డిబేట్ కార్యక్రమంలో జరిగిన దాడిని బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి పత్రిఖాముఖంగా తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ విష్ణువర్ధన్‌రెడ్డి గారు జాతీయ యువ సంఘటన వైస్‌ఛైర్మన్‌గా రాజ్యాంగ పదవిలో వున్నారు. ఆయనపై కొలికిపూడి శ్రీనివాసరావు అసభ్య దూషణ మరియు కాలిచెప్పుతో దాడిచేస్తూ అరాచక శక్తులను రెచ్చగొట్టి బిజెపిని, విష్ణువర్ధన్ రెడ్డిని బదనామ్ చేయుటకు మరియు బిజెపిని భయపెట్టుటకు చేసినట్లుగా ఉంది. ఇటువంటి చర్యలను సభ్యసమాజం ఖండించాలి. జరిగిన సంఘటనలో ఎబిఎన్ యాంకర్ వెంకటకృష్ణ ప్రత్యక్ష సాక్షిగాను, అదేవిధంగా ఎబిఎన్ ఛానల్ యాజమాన్యం బాధ్యత వహించాలి. దీనివెనుక తెలుగుదేశం పార్టీ కొలికిపూడి శ్రీనివాసరావును ప్రోత్సహిస్తూ అతనిని అన్నివిధాలుగా చూసుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద ఉసిగొల్పుతున్నది. ఇటువంటి చర్యలను తెలుగుదేశం అధ్యక్షులు అమరావతి అని, విశాఖ స్టీల్‌ప్లాంట్ అని, స్పెషల్ స్టేటస్ అని ఉద్యమాలు చేస్తూ స్వప్రకటిత మేధావులుగామాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండిచాలి. అదేవిధంగా ఇటువంటి వారిని తెలుగుదేశం ప్రోత్సహించరాదని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి వ్యక్తులను ఛానల్స్‌కు, చర్చావేదికలకు పిలవకుండా వుండాలని, లేని పక్షంలో బిజెపి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనుట పునరాలోచిస్తుందని తెలియజేస్తుంది. బిజెపి జమ్ముకాశ్మీర్, కేరళ లాంటి రాష్ట్రాలలో ఉగ్రవాదులతో పోరాడుతున్నది. ఇటువంటి శక్తులతో పోరాడడం బిజెపికి ఒక లెక్కకాదు. ప్రజాస్వామ్యంలో చర్చ జరుగుతున్న సందర్భంలో తను సమస్యలను ఎత్తిచూపకుండా భౌతిక దాడులకు దిగుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి తమకు తాము ప్రకటించుకొని ప్రజల మీద పడి జీవనము సాగిస్తున్న ఇటువంటి అరాచక శక్తులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి అరాచక శక్తులను ఎగదోస్తూ వారిని పెంచి పోషిస్తున్నాయి. కొంతమంది అర్బన్ నక్సల్స్‌గా అవతారమెత్తి ఉన్నత విద్యావంతులని చెప్పుకుంటూ కులాన్ని అడ్డుపెట్టుకొని సమాజంలో పెట్రేగిపోతున్నారు. ఇటువంటి వారిని బిజెపి ప్రజా స్వామ్యయుతంగా బుద్ధిచెబుతుంది. ఒకవేళ ఇలాంటి వారు ఘర్షణాత్మక వైఖరే కోరుకుంటే దానికి బిజెపి సిద్ధంగా వుంది. ఇటువంటి వారి ఆటలు, చర్యలు సాగవని తీవ్రంగా హెచ్చరించారు.









