కురుగుంటలో సిమెంట్ రోడ్ కు భూమి పూజ

కురుగుంట

       అనంతపురం రూరల్ ( జనస్వరం ) : అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గ్రామంలో వైఎస్సార్ కాలనీలో రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.  ఈ విషయం తెలుసుకున్న ఎం‌ఆర్‌పి‌ఎస్ నాయకులు బి.సి.ఆర్ దాస్ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి రోడ్డు వేయడానికి స్పందించారు. బి.సి.ఆర్ దాస్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు రోడ్డు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారని, అధికారులు స్పందించి రోడ్డు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సిమెంట్ రోడ్డు వేయడానికి భూమి పూజ నిర్వహించారు. కురుగుంట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదినారాయణ, వైసీపీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, మాధవ రెడ్డి, ముస్తఫా, ఈశ్వరయ్య, ఓబులపతి, రామకృష్ణ మరియు ఎం‌ఆర్‌పి‌ఎస్ నాయకులు  మాలరాయుడు, రాము, కుళ్ళయప్ప తదితరులు పాల్గొన్నారు. 

See also  హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన HYMNNSCon 2026 అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సు