భైంసా బుద్ధ విహార్‌కు దేశ విదేశాల దృష్టి.. ఆదివారం వందనాలకు భారీ స్పందన

– భైంసా బుద్ధ విహార్ పేరు ప్రపంచంలో అంతా వినబడుతుంది.

– బుద్ద వందనాలకు వందల కొద్ది తరలివస్తున్న ప్రజలు

– అందరూ కలసి భైంసా బుద్ధ విహార్ ను అభివృద్ధి చేద్దాం

– భైంసా బుద్ధ విహార్ టీం

భైంసా, మార్చి 29 (జనస్వరం) : పట్టణంలోని భైంసా బుద్ధ విహార్‌లో ప్రతి ఆదివారం నిర్వహించే బుద్ధ వందన కార్యక్రమానికి ప్రజల స్పందన రోజురోజుకు పెరుగుతూ విశేషంగా నిలుస్తోంది. ఈ ఆదివారం కూడా విహార్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన బుద్ధ వందన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని బుద్ధుని విగ్రహానికి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, రమాబాయి చిత్రపటాలకు కొవ్వొత్తులు వెలిగించి పుష్పాంజలి ఘటించారు. సిద్దూర్ గ్రామానికి చెందిన మోతే అరుణ్, సాయిల్లు, కరుణ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు భోజనాలు వడ్డించారు. భైంసా బుద్ధ విహార్‌లో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో శాంతి, సౌభ్రాతృత్వ భావాలను పెంపొందిస్తున్నాయని పాల్గొన్న వారు తెలిపారు. ఈ సందర్భంగా బౌద్ధాచార్య పాండురంగ్ జాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం నిర్వహించే బుద్ధ వందనాలకు వందలాది మంది తరలివస్తుండటం వల్ల భైంసా బుద్ధ విహార్ పేరు దేశ విదేశాల్లో కూడా వినిపిస్తోందన్నారు. మనం చేస్తున్న కార్యక్రమాల గురించి ఇతర ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ రావడం ఆనందదాయకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కలసి బుద్ధ విహార్‌ను మరింత అభివృద్ధి చేయాలని, ప్రతి గ్రామం నుంచి ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని మంచి ఆలోచనలు, విలువలను తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విహార్‌ను మరింత విస్తరించి విద్య, ధ్యానం, సామాజిక సేవా కార్యక్రమాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. యువత బౌద్ధ తత్వాన్ని అవలంబించి సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విహార్ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

See also  డా. చంటి ముదిరాజ్‌కు ప్రతిష్ఠాత్మక సేవారత్న అవార్డు