ఔషధ మొక్కలపై అవగాహనా సదస్సు విజయవంతం

– ఐదు ప్రపంచ రికార్డులు సాధించిన సీఈవో ఆవుల చంద్రశేఖర్ కు ఘనసత్కారం

ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ, తిరుపతి, ఆగష్టు 10, జనస్వరం : ఔషధ మొక్కలు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు (ఏపీఎంఏపీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఐదు అంతర్జాతీయ అవార్డుల గ్రహీత ఆవుల చంద్రశేఖర్ అన్నారు. మానవ నాగరికత ఆరంభం నుంచి రోగాల నివారణకు, ఆరోగ్య పరిరక్షణకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఏపీఎంఏపీ బోర్డు సహకారంతో సోమవారం ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల ప్రదర్శనను సిఈఓ పరిశీలించారు. సభకు ప్రిన్సిపాల్ ఎన్. వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షత వహించగా, బోర్డు సీఈవో చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయుర్వేద, సంప్రదాయ వైద్య విధానాల్లో ఔషద మొక్కల పాత్ర చాలా కీలకమన్నారు. తులసి, పసుపు, అశ్వగంధ, కలబంద వంటి ప్రముఖ ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలను బాగా గుర్తించామన్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నివారణకు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి తులసి అద్భుతంగా పనిచేస్తుంది. గాయాలను మాన్పడంలో, యాంటీబియాటిక్‌గా మరియు శరీరంలో మంటను తగ్గించడంలో పసుపు సహాయపడుతుందన్నారు. అశ్వగంధ మానసిక ఒత్తిడిని తగ్గించి, శక్తిని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందన్నారు. రక్తశుద్ధికి, చర్మ వ్యాధుల నివారణకు మరియు బ్యాక్టీరియాను అరికట్టడానికి వేప ఉపయోగపడుతుందన్నారు. చర్మానికి నిగారింపు తెచ్చి, కాలిన గాయాలను, కడుపు మంటను కలబంద తగ్గిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ వైస్ – ప్రిన్సిపాల్ మల్లికార్జున రావు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో జరిగిన అవగాహనా సదస్సులో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. వేణుపాల్ రెడ్డి, వైస్ – ప్రిన్సిపాల్ మల్లికార్జున, వృక్షశాస్త్ర విభాగాధిపతి డా. ఏ . సురేఖ, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ బోటనీ విభాగాధిపతి డా. బి. జ్యోతి, ఫ్యాకల్టీ డా. కె. సుజాత, డా. ఎం.సుధాకర్, పూర్వ ప్రిన్సిపాల్, వృక్ష శాస్త్ర విభాగపు మాజీ అధిపతి డా. సి. రమేష్, బోటనీ విభాగపు విశ్రాంత అధిపతి డా. ఎన్. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

See also  జాబ్ కాలెండర్ లో గ్రూప్-1,2 జాబ్స్ ఎక్కడ?- జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం యస్ కే యు అధ్యక్షులు జయంత్ వర్ధన్