
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డుకు ఎంపికైన స్వప్న కూచిపూడి డాన్స్ అకాడమీ అధినేత్రి జి. స్వప్న .
హైదరాబాద్,ఫిబ్రవరి 19.( జనస్వరం)
హైదరాబాద్ పట్టణంలోని మియాపూర్ నందు ఉన్నటువంటి స్వప్న కూచిపూడి డాన్స్ అకాడమీ అధినేత్రి జి. స్వప్న కి వాజ్ పేయి అద్వాని సేవా సంస్థ వ్యవస్థాపకులు పాలకొలను పీరారెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 22 ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా స్వచ్ఛందంగా నిరంతర సమాజంలో సేవలు చేస్తున్నటువంటి వారికి ఆన్లైన్ ద్వారా ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మీద అవార్డ్స్ అందించడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుండి భారతదేశ సంస్కృతి సంస్కారంను కూచిపూడి నృత్యం ను కొన్ని వేల మంది పిల్లలకు నేర్పిస్తూ, ఆ పిల్లల ద్వారా సమాజంలో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నటు వంటి అనేక కార్యక్రమాలలో సభా వేదికలపై పిల్లలచే చక్కటి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రదర్శిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన స్వప్న కూచిపూడి డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపరాలు జి.స్వప్న కు ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు 2026కు ఎన్నిక కావడం జరిగింది.ఈ సందర్భంగా స్వప్న డాన్స్ అకాడమీ అధినేత్రి జి. స్వప్న మాట్లాడుతూ ఇలాంటి గొప్ప స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి భారతదేశ ప్రభుత్వం భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ స్వచ్ఛందంగా సమాజంలో మేం చేస్తున్న సేవలను గుర్తించి మాకు స్వాతంత్ర్య సమరయోధుడు అయిన నరసింహారెడ్డి పేరు మీద అవార్డు అందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సంస్థ వ్యవస్థాపకులు పాలకొలను పీరారెడ్డికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన జి. స్వప్న.








