ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోండి? ప్రకాశం జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల

   ఒంగోలు, (జనస్వరం) : సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 35ను హైకోర్టు రద్దు చేయడం జగన్‌రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల అన్నారు. మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్ళు జగన్మోహన్‌రెడ్డి పాలనలో అన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే అన్నారు. ఉన్నతమైన న్యాయస్థానాలు చీవాట్లు, ముట్టికాయలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరు మారడం లేదన్నారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతమౌతుంటే, జగన్‌ రెడ్డి మాత్రం నియంత పాలన సాగిస్తున్నారన్నారు. అన్నీ పథకాలు అవినీతిమయం, అభివృద్ధి శూన్యం, రహదారులు, రోడ్లు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఇలా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టు తీర్పులుతోనైన బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. లేదంటే ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడక తప్పదని కల్యాణ్ ముత్యాల హెచ్చరించారు.

See also  పెద్ద అబ్బీపురం గ్రామ రైతులకు న్యాయం చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్