అనారోగ్యంతో బాధపడుతున్న జనసేన కార్యకర్తకు 55 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించిన అవనిగడ్డ జనసేన నాయకులు

    అవనిగడ్డ, (జనస్వరం) : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ మండలం రామచంద్రపురం గ్రామంలో ఉంటున్న, జనసేన ఆవిర్భావం నుండి ఇప్పటివరకు మనతోనే ఉంటున్న జనసైనికుడు మత్తి సుబ్రహ్మణ్యం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్ ఉండి వైద్యం చేయించుకున్న విషయం అందరికీ తెలిసినదే. మళ్ళీ ఇప్పుడు ఇతనికి రెండవసారి ఇబ్బంది వచ్చి హాస్పిటల్ లో చేరటం జరిగింది. మొదటి సారి సుమారు 5 లక్షలు ఖర్చు అయినది. ఎన్ని జరిగిన ఏ రోజు హెల్ప్ ఆశించే వాడు కాదు. మరల ఇప్పుడు మరల ఆపరేషన్ చెయ్యవలసి వచ్చినది. అయితే జనసేన నాయకులు, జనసైనికులు సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి గమనించి 55,000 వేల రూపాయలు సహాయం చెయ్యటం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ కుటుంబం హాజరు అయ్యి సుబ్రహ్మణ్యం ఇంటీ దగ్గరికి వెళ్ళి అతని ఆరోగ్య విషయాలు తెలుసుకొని ఆర్థిక సహాయం చెయ్యటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో, జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామ్ గారి చూచనలు ప్రకారం జనసైనికుడుకు అండగా నిలవటం జరిగింది. సుబ్రహ్మణ్యం ఆరోగ్య విషయంలో నాయకులు, జనసైనికులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించిన వారికి పేరు పేరునా అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ ద్వారా ధన్యవాదములు తేలుపుతున్నాము. సుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషయంలో మేము అందరం అండగా ఉండి అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు, సిద్దినేని అశోక్ నాయడు, జిల్లా ఉప కార్యదర్శి షరీఫ్ గారు, ఎంపీటీసీ భాను గారు, రామచంద్రపురం వార్డ్ నెంబర్ సాయి, జనసేన పార్టీ మహిళ నాయకురాలు అర్జా రాధిక గారు, జనసేన నాయకులు మడమల రంజిత్ కుమార్, విమల్ కృష్ణా, తోట మురళి కృష్ణా, పసుపులేటి రవి కుమార్, బొందాలపాటి ప్రసాద్, పప్పుశెట్టి శ్రీనివాస్ రావు, గౌస్, తదితరులు పాల్గొన్నారు.

See also  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ - జనసేన నిర్ణయం...

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి