రైతుల పక్షాన పోరాడితే అరెస్ట్ లా? జనసేన నాయకులు త్యాడా రామకృష్ణారావు (బాలు)

    విజయనగరం, (జనస్వరం) : లచ్చయ్యపేట షుగర్‌ ఫ్యాక్టరీ బాధితులకు అండగా నిలబడేందుకు జిల్లావ్యాప్తంగా అక్కడకు వెళుతున్న జనసేన నాయకులను, కార్యకర్తలను, పోలీసుల హౌస్‌ అరెస్ట్‌, అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద శాంతియుత నిరసన తెలిపి, అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇద్దామని వెళ్లిన విజయనగరం జనసేన పార్టీ  సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్‌, దాసరి యోగేష్‌ లను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి వన్‌టౌన్‌లో నిర్బంధించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ రైతుల పక్షాన పోరాడితే అరెస్ట్‌లు చేసి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. చెరుకు రైతులకు న్యాయం జరిగే వరకు జనసేనపార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  ప్రభుత్వ పథకాలకు నిబంధనలు వర్తించవా...? : విజయనగరం జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి