గిరిజనులకు మంచినీరు ఇవ్వాలని ఎంపీడీవో కి వినతిపత్రం ఇచ్చిన అరకు జనసేన నాయకులు

     అరకు, (జనస్వరం) : అరకు వేలి మండలం కొత్తబళ్ళు గుడ పంచాయతీ పరిధిలో గల జనం గూడాలో కొళాయి నిర్మాణం త్వరగా చేపట్టి గిరిజనులకు మంచినీరు సదుపాయం కల్పించాలని, జనసేన నాయకులు సాయి బాబా, రామకృష్ణ సోమవారము ఎంపీడీవో ఆఫీసు వద్దకు వెళ్లి ఎంపీడీవో గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీనికై ఎంపీడీవో స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను క్లుప్తంగా వివరించగా, పది రోజుల్లో కొళాయి నిర్మాణం చేపట్టి పూర్తి స్థాయిలో గిరిజనులకు మంచి నీరు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

See also  నెల్లిమర్ల నియోజకవర్గంలోని లోకం మాధవి గారి ఆధ్వర్యంలో అట్టహాసంగా సాగిన ఎంసెట్ రిజిస్టేషన్స్ ప్రక్రియ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :