అరకు – జగనన్న ఇల్లు పేదలకి కన్నీరు

అరకు

          అరకు ( జనస్వరం ) : ఆనంతగిరి మండలం పరిధిలో గల టోకురు పంచాయితీ పూలు గూడా గ్రామంలో  జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు జగనన్న మోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇల్లు పేదలకు కన్నీరు అని ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఇళ్ల పట్టాలు ఇచ్చిన బాధితులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా మాదల శ్రీరాములు, కొర్ర ప్రవీణ్ కుమార్, అనంతగిరి పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి, అరకు మండల పార్టీ అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ వీరితోపాటు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  రత్నగిరిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం, స్థానిక ఎన్నికల బలోపేతం గూర్చి చర్చ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి