జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో గ్రామ కమీటీల నియామకం

జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో గ్రామ కమీటీల నియామకం

                 జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర గారు మండల కమీటీల ఆధ్వర్యంలో సింగరంపాలెం, రామయ్యపాలెం, వీరలంకపల్లి, రంపఎర్రపాలెం, తిరుమలాయపాలెం, సింహాంద్రిపురం, వేలంక, రాజపూడి గ్రామాలతో కలిపి ఇప్పటి వరకూ 15 గ్రామాలలో గ్రామ కమీటీలు వేశారు. అలాగే జనసైనికులందరితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులకు జనసేన సిద్దాంతాలను వివరిస్తూ వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో వివరించారు. అలాగే వచ్చే స్థానిక ఎన్నికలను ప్రస్తావిస్తూ గ్రామాల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. అదే విధంగా జనసేన ఇంటి పంట ద్వారా నేటి వరకూ 2500 గృహాలకు విత్తనాలను పంచామని అన్నారు. ఇప్పటి వరకూ జగ్గంపేట నియోజకవర్గంలో 54 గ్రామాలలో పంపిణీ చేసిన మొత్తం విత్తనాల ప్యాకెట్లు 63500 అని అన్నారు. నియోజకవర్గం మొత్తం విత్తనాలు పంచడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.  

See also  వైసీపీ నాయకుల వర్గ పోరుతో నెల్లూరు జిల్లాలో సాధించిన అభివృద్ధి శూన్యం : గునుకుల కిషోర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :