కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేనపార్టీ మండల కమిటీలు నియామకం

    కళ్యాణదుర్గం, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలోని మండలాల కమిటీ నియామకం ఏవిధంగా పూర్తి చేయాలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు TC.వరుణ్ సూచనల మేరకు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాలలో జనసేన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. గత 5,6 సంవత్సరాలుగా జనసేన పార్టీలో ఉంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్న జనసేన కార్యకర్తలను గుర్తించి వారికి మండల కమిటీలలో స్థానం కల్పించడం జరిగింది. అలాగే కౌలు రైతుల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శులు రాపా ధనంజయ, చంద్రశేఖర్, నరసయ్య, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్, రాజేష్ మండల అధ్యక్షులు జై కృష్ణ, ఆంజనేయులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

See also  సిజి రాజశేఖర్ కు సత్కారం చేసిన పత్తికొండ జనసేన పార్టీ నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి