మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అప్పల రాజుకి రూ. 30000 ఆర్థిక సహాయం అందించిన మాడుగుల జనసైనికులు

మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అప్పల రాజుకి రూ. 30000 ఆర్థిక సహాయం అందించిన మాడుగుల జనసైనికులు  

                మాడుగుల నియోజకవర్గం, బైలపూడి గ్రామానికి చెందిన స్వీపర్ పట్నాల అప్పలరాజుకి మెదడులో నరాలు చిట్లి ఆపరేషన్ చేయాల్సి రావడంతో, నియోజకవర్గ జనసైనికుల ఆర్ధిక సహాయంతో 30 వేల రూపాయలు మరియు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. ఈ సహాయానికి విరాళాలు ఇచ్చిన జనసైనికులందరికీ దన్యవాదాలు తెలిపారు అప్పలరాజు కుటుంబ సభ్యులు. మాడుగుల జనసైనికులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకుంటామని, జనసైనికులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తామని అన్నారు. సహాయం చేయడమే కాదు పార్టీని కూడా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు.  
See also  దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి